HomeTelugu Trendingఅమిగోస్‌: లిరికల్‌ సాంగ్‌ విడుదల

అమిగోస్‌: లిరికల్‌ సాంగ్‌ విడుదల

Yeka Yeka Video Song from A

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడున్నా స్నేహం వెతికాం, పక పక పక ఇక్కడికి వచ్చి ఒకరికి ఒకరం దొరికాం’ అంటూ ఈ పాట సాగుతోంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

ఈ పాటలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేసే క్రమంలో వచ్చే పాట ఇది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu