‘అమిగోస్‌’ ట్రైలర్‌ విడుదల


నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అందుకు సంబంధించి వదిలిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈక్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం కర్నూల్ లోని శ్రీరామ థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఈ ట్రైలర్‌ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. తనని పోలిన మనుషుల వలన హీరో చిక్కుల్లో పడతాడనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. క్రితం ఏడాది ‘బింబిసార’ సినిమాతో కల్యాణ్ రామ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates