ఉత్కంఠగా అడివి శేష్‌ ‘ఎవరు’ టీజర్‌

హీరో అడివి శేష్‌ నటిస్తున్న ‘ఎవరు’ సినిమా టీజర్‌ విడుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా టీజర్‌ను రూపొందించారు. ‘నా విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు’ అనే రెజీనా డైలాగ్‌, నటుడు నవీన్‌ చంద్ర హత్య సీన్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ‘నిజాలు మాట్లాడుకుందామా?’ అంటూ ఆయన రెజీనాను విచారిస్తున్నారు. ‘పోలీసులు హత్య అంటున్నారు, మీరు రేప్‌ అంటున్నారు. రెండూ నిజాలు కాకపోతే..’ అని శేష్‌ ప్రశ్నిస్తున్న ఈ టీజర్‌ ఉత్కంఠగా ముగిసింది. ఈ సినిమాకు వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates