పెళ్లి కుమార్తెగా ప్రియాంక.. తొలి ఫొటోలు


ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్‌ పెళ్లి వేడుక ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. డిసెంబరు 1న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, డిసెంబరు 2న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. మెహెందీ, సంగీత్‌ ఫొటోలు, వీడియోను ప్రియాంక సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కానీ పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఫొటోలు మాత్రం బయటికి రాలేదు.

తాజాగా ‘నిక్యాంక’ క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం తయారైన ఫొటోలు బయటికి వచ్చాయి. క్రైస్తవ వివాహం కోసం ప్రియాంక పొడవాటి తెలుపు రంగు గౌనులో, హిందూ పద్ధతిలో వివాహం కోసం ఎరుపు రంగు లెహంగాలో మెరిశారు ప్రియాంక. వధూవరులు చూడచక్కగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి కుమార్తెగా ప్రియాంక అభిమానుల మనసులు దోచుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates