HomeTelugu Trendingరాకింగ్‌ స్టార్‌ యశ్ ఏడ్వటం తొలిసారి చూశా: భార్య రాధిక

రాకింగ్‌ స్టార్‌ యశ్ ఏడ్వటం తొలిసారి చూశా: భార్య రాధిక

9 22తన భర్త, కన్నడ స్టార్‌ యశ్‌ కంటతడి పెట్టుకోవడం తొలిసారి చూశానని నటి రాధిక అన్నారు. గత ఏడాది డిసెంబరులో ఈ దంపతులకు ఆడశిశువు జన్మించింది. ఇటీవల పాపకు చెవిపోగులు కుట్టించారట. ఆ సమయంలో తల్లిదండ్రులుగా తల్లడిల్లిపోయామని రాధిక సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. పాపతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పాప ఐరాకు చెవి పోగులు కుట్టించాం. తల్లిదండ్రులుగా మా జీవితంలో అతి కష్టమైన రోజు అది. చిన్నారి విపరీతంగా ఏడుస్తుంటే చూస్తూ.. తట్టుకోలేకపోయాం. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కళ్లలో తొలిసారి కన్నీరు చూశా. ఆ తర్వాత ఈ బంధాలు ఎంత గొప్పవో అర్థం చేసుకున్నా. మీరేం (అభిమానులు) బాధపడకండి.. తండ్రీకూతుర్లు ఇప్పుడు బావున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు యశ్‌. రాధిక బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించారు. 2008లో ‘మూగిన మనసు’ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో యశ్‌ హీరోగా నటించారు. తర్వాత యశ్‌, రాధిక కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. దీంతో వీరిద్దరు వెండితెరపై పాపులర్‌ కపుల్‌గా మారారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2016లో కుటుంబ సభ్యుల సమ్మతితో వీరి వివాహ వేడుక జరిగింది. రాధిక తరచూ కుమార్తె ఫొటోల్ని షేర్‌ చేస్తూ ఉంటారు. యశ్‌ ‘కేజీఎఫ్‌’ కు కొనసాగింపుగా తీస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్‌ కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!