HomeTelugu Trendingటాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌ కుమార్‌..

టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌ కుమార్‌..

3 4ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఒక్కరికే చోటుదక్కింది. జూన్‌ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో ఈ బాలీవుడ్‌ ఖిలాడీ ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన టాప్‌ 100 సెలబ్రిటీల సరసన చేరారు. కాస్మెటిక్‌ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్‌ రూ 4453 కోట్ల రాబడితో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. ఈ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు 52వ స్దానం లభించింది. 2019 జాబితాలో 33వ స్ధానంలో నిలిచిన అక్షయ్‌ కుమార్‌ ఈసారి 19 ర్యాంకులను కోల్పోయినా టాప్‌ 100లో తన స్ధానం పదిలపరుచుకున్నారు.

గత ఏడాది అక్షయ్‌ రాబడి రూ 490 కోట్లు కాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సంపదపై కరోనా వైరస్‌ ప్రభావం పడిందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. అమెజాన్‌ ప్రైమ్‌తో అక్షయ్‌ కుమార్‌ డిజిటల్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ ఏడాది అత్యధిక రాబడి పొందే టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కేందుకు దోహదపడింది. అక్షయ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌ సిరీస్‌ కోసం రూ 75 కోట్లతో ఒప్పందం చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా భక్త నిక్ జాన్స్ సోదరులు కూడా ఉన్నారు. వారు జాన్స్ బ్రదర్స్కు ఈ జాబితాలో 20వ స్థానం దక్కింది. అమెరికన్ సింగర్స్ అయిన జాన్స్ బ్రదర్స్ స్టేజ్ షోలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే వారి ఆదాయం విపరీతంగా పెరిగి 20వ స్థానంలో నిలిచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!