
Gauri Khan interior designs:
Gauri Khan బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ భార్య మాత్రమే కాదు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కూడా. తాజాగా ఆమె తన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విలాసవంతమైన డిజైన్‌లతో కస్టమర్లను ఆకర్షించే ఈ వెబ్‌సైట్ గౌరీ ప్రతిభకు అద్దం పడుతుంది. తాజాగా హార్పర్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డు గెలుచుకున్న గౌరీ, తన సఫరిని 40 ఏళ్ల వయసులో ప్రారంభించడం ద్వారా కలల నెరవేర్చడానికి ఏది ఆలస్యం కాదని నిరూపించారు.
గౌరీ ఖాన్ వెబ్‌సైట్ లో ఆమె సిగ్నేచర్ ప్రాజెక్టులు, విలాసవంతమైన ఇళ్ళు, కమర్షియల్ స్పేస్‌ల నైపుణ్యాలను చూపిస్తుంది. ఈ వెబ్‌సైట్ లో ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది. అందులో కొన్ని ప్రోడక్ట్‌లు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి:
ఆర్టీఫ్యాక్ట్స్
ఫర్నిచర్, లైటింగ్
బెడింగ్, కుషన్‌లు
అద్దాలు, ప్లాంటర్లు
అందులో అందరి దృష్టిని ఆకర్షించినవి మాత్రం క్యాండిల్ హోల్డర్స్. గౌరీ రూపొందించిన క్యాండిల్ హోల్డర్స్ అసాధారణంగా అందంగా ఉంటాయి. కానీ ఈ ధర వినడానికి ఆశ్చర్యంగా ఉంది. సాధారణ మార్కెట్లో Rs. 100-200 ఖరీదుగా ఉండే క్యాండిల్ హోల్డర్స్, గౌరీ ధరలు రూ. 6,000 నుంచి ప్రారంభమవుతాయి. ప్రీమియం ఆప్షన్లు రూ. 15,000 వరకు ఉంటాయి. ఇది ఖరీదైనా, గౌరీ ఖాన్ బ్రాండ్ విలువ అది.
ఇంకా ఈ వెబ్‌సైట్‌లో సోఫాలు, బెడ్స్ వంటి ఫర్నిచర్ ధరలు రూ. 75,000 నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉన్నాయి. ఇవి విలాసవంతమైన జీవనశైలిని కోరుకునే కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్. గౌరీ ఖాన్ ఈ మార్చి నెలలో ఢిల్లీలో డిజైన్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ క్లయింట్లు వ్యక్తిగతంగా ఆమె డిజైన్‌లను చూసి ఆస్వాదిస్తారు.