ఘంటసాల బయోపిక్ ..!

మన తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు భారతదేశం గర్వించదగిన గాయకుల్లో ఒకరు. ఘంటసాల మరణించి నాలుగున్నర దశాబ్దాలు కావొస్తున్నా ఆయన గానామృతం ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.

ఇప్పుడు ఆ మాహానీయుడి జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందనుంది. ఘంటసాల జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన సి.హెచ్.రామారావు ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రను చేయనుండగా, అతని భార్య మృదుల ఘంటసాల సతీమణిగా కనిపించనుంది. లక్ష్మీ నీరజ నిర్మించనున్న ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు వాసు రావు సంగీతం అందించనున్నాడు.