Homeతెలుగు Newsజగన్‌కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు

జగన్‌కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు

8 6టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్ బాబాయ్‌ ఆదిశేషగిరిరావు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీని వీడుతున్నట్టు ఆదిశేషగిరిరావు సోమవారం రాత్రే ప్రకటించగా… ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆదిశేషగిరిరావు… వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూసిన తర్వాత వైసీపీలో చేరారు… చాలా కాలం వైసీపీలో యాక్టివ్‌గా పనిచేసిన ఆయన… కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పార్టీని వీడుతున్నట్టు జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు ఆదిశేషగిరిరావు. వైసీపీ నుంచి తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఆదిశేషగిరిరావు భావించగా… విజయవాడ లోక్‌సభ సీటు నుంచి పోటీచేయాలని వైసీపీ అధినేత సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు… పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరోవైపు ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత కృష్ణ, ఆదిశేషగిరిరావు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున భారీ సమావేశం నిర్వహించి టీడీపీలో చేరడంపై చర్చించనున్నారనే సమాచారం. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం సాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!