
Godari Gattu Composer:
భీమ్స్ సిసిరోలియో.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎందుకంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్టార్డమ్ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది. వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ.303 కోట్లు వసూలు చేసి పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది.
ఈ సినిమాలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ‘గోదావరి గట్టు’ పాటను అభిమానులు చేతుల మీద పడేశారు. యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ పాట భీమ్స్ టాలెంట్‌కు సాక్ష్యంగా నిలిచింది. దాంతో ఇప్పుడు భీమ్స్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, భీమ్స్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇదివరకు మూడు నుంచి నాలుగు కోట్ల పరిధిలో ఉన్న రేట్, ఇప్పుడు డబుల్ అయిందంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు చాలా టాప్ నిర్మాతలు, స్టార్ హీరోలు భీమ్స్‌ను తమ సినిమాలకు తీసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారట. పాటలతో పాటు బీ జీయం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) లోనూ భీమ్స్ తనదైన స్టైల్ చూపించగలడన్న నమ్మకంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈసారి సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాతో భీమ్స్ తన మార్క్ చూపించడంతో పాటు, తన పారితోషికాన్ని కూడా రెట్టింపు చేసుకున్నాడు. అసలే సంగీత దర్శకులకు మార్కెట్ పెరుగుతోందన్న విషయం తెలిసిందే. అందులో భీమ్స్ ఇప్పుడు టాప్ లిస్టులో నిలవడం విశేషం.
ALSO READ: Arjun Reddy సినిమా గురించి దిమ్మ తిరిగే నిజం బయటపెట్టిన Manchu Manoj













