HomeTelugu Trendingజూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులకు గుడ్‌న్యూస్

జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులకు గుడ్‌న్యూస్

Junior NTR good news 1

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కలిగిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన ‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

RRR సినిమాకు ముందు తారక్ గురించి ఉత్తరాది వారికి కూడా పెద్దగా తెలియదు. ఇప్పుడు ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌కు మరో గౌరవం దక్కింది.

ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’లో జూనియర్ ఎన్టీఆర్‌ స్థానం సంపాదించాడు. ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్’ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో జూ.ఎన్టీఆర్‌కు స్థానం కల్పించింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది.

వీరిలో తారక్‌తో పాటు కే హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. ఇంతటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్‌పై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. పార్ట్-1 2024 ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తోంది. ఇంకా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!