
GTA 6 Cost and release date:
వీడియో గేమ్స్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల ఆట కాదు! ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీగా మారిపోయాయి. అందులో కూడా Grand Theft Auto సిరీస్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. “GTA 5” గేమ్ 2013లో వచ్చినప్పుడు మూడు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్లు సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న “GTA 6” ఎట్టకేలకు రానుంది. కానీ ఈ గేమ్ తయారవ్వడానికి 13 సంవత్సరాలు పట్టిందట! ఊహించండి — బుర్జ్ ఖలీఫా 6 సంవత్సరాల్లోనే పూర్తయ్యింది, కానీ ఈ గేమ్ తయారీకి రెండింతల సమయం తీసుకుంది.
ఇక్కడే అసలు షాక్ విషయం. బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి దాదాపు రూ.12,694 కోట్లు (అంటే 1.5 బిలియన్ డాలర్లు) ఖర్చయింది. కానీ GTA 6 తయారీకి మాత్రం దాదాపు రూ.16,926 కోట్లు (2 బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందట! ఇది హ్యాకర్స్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, ఇందులో డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఫ్యూచర్ అప్‌డేట్స్ అన్నీ కలుపుకొని చెప్పబడింది.
Rockstar Games దీనిని అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇది నిజం అయితే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గేమ్ అవుతుంది. అంత ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే — ఈ గేమ్‌లో రియలిస్టిక్ వరల్డ్, స్మార్ట్ క్యారెక్టర్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, డిటెయిల్స్ అన్నీ ఉంటాయట.
2026 మే 26న విడుదల కానున్న ఈ గేమ్ ధర కూడా దాదాపు $100 వరకు ఉండొచ్చని ఊహిస్తున్నారు. కానీ నిపుణులు చెబుతున్నది ఏంటంటే — ఇదంతా ఒక్క రోజులోనే రికవర్ అవుతుందట! అంటే “GTA 6” ప్రపంచంలోనే గరిష్టమైన లాంచ్ అవ్వబోతోంది అన్న మాట!
ALSO READ: Samantha దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఏంటో తెలిస్తే షాకే..