
Highest paid TV actress remuneration per episode:
ఇప్పుడు భారత టీవీ పరిశ్రమలో జన్నత్ జుబైర్ పేరు దుమ్మురేపుతోంది. కేవలం 23 ఏళ్లకే, జన్నత్ టీవీ నటి మాత్రమే కాకుండా సోషల్ మీడియా స్టార్‌గా కూడా అద్భుతమైన గుర్తింపు పొందింది. ఇటీవల, కత్రోన్ కే ఖిలాడీ మరియు లాఫ్టర్ ఛాలెంజ్ వంటి షోలకు సంబంధించిన ఆమె పారితోషికం చర్చనీయాంశమైంది.
జన్నత్, కత్రోన్ కే ఖిలాడీ కోసం ఒక్క ఎపిసోడ్‌కి 18 లక్షలు సంపాదించింది. అలాగే లాఫ్టర్ ఛాలెంజ్‌లో ఒక్క ఎపిసోడ్‌కి 2 లక్షలు పొందింది. వీటితో పాటు, ఆమె సోషల్ మీడియా పోస్టుల కోసం 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు చార్జ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఆమె ప్రభావం తారస్థాయికి చేరింది. జన్నత్ జుబైర్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో షారుఖ్ ఖాన్‌ను కూడా దాటింది. ఆమెకు ప్రస్తుతం 49.7 మిలియన్స్ ఫాలోవర్లు ఉండగా, షారుఖ్ ఖాన్ 47.7 మిలియన్స్ వద్ద ఉన్నారు.
జన్నత్ కెరీర్ ప్రారంభం నుండి ఫుల్వా, తు ఆశిఖి, మహారాణా ప్రతాప్, దిల్ మిల్ గయే వంటి పాపులర్ షోలలో నటించింది. ఆమె బాలీవుడ్ సినిమా హిచ్కీలో రాణి ముఖర్జీతో నటించింది. రియాలిటీ షోలలో కూడా పాల్గొని, సంగీత ఆల్బమ్స్ ద్వారా ఫ్యాన్స్‌ను అలరించింది.
ఇతర అత్యధిక పారితోషికం పొందుతున్న టీవీ నటులు
జన్నత్ తర్వాత టాప్ 6 టీవీ నటి జాబితాలో ఉన్నవారు:
అంకిత లోఖండే: ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు
రూపాలి గాంగూలీ: ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు
తేజస్వి ప్రకాష్: రూ. 2–3 లక్షలు
హీనాఖాన్: రూ. 1.5–2 లక్షలు
జెన్నిఫర్ వింగెట్: రూ. 1–2 లక్షలు
ALSO READ: Vijay Devarakondaతో Rashmika తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసిందా..?