HomeTelugu Newsవ్యాపారవేత్తతో హన్సిక పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

వ్యాపారవేత్తతో హన్సిక పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

13 1
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లతో దుసుకుపోయింది. టాలీవుడ్ తో పాటు, తమిళ పరిశ్రమలో కూడా బీజీగా మారిపోయింది ఈ అమ్మడు. ఈ మధ్య కాస్త జోరు తగ్గిన హన్సిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ వ్యాపారవేత్తను హన్సిక పెళ్లాడబోతోందంటూ ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఆ తర్వాత నెటిజన్లు ఈ వార్తను వైరల్ చేశారు.

ఆ వార్త చూసి హన్సిక ఆశ్చర్యానికి గురయ్యారు. ‘పుకార్లు.. దేవుడా.. ఇంతకీ వరుడు ఎవరు?’ అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ వార్తను చూసిన హన్సిక స్నేహితుడు ‘ఓ మై గాడ్‌.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు?’ అని ఆమెకు ట్వీట్‌ చేశాడు. ‘నాక్కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్పలేకపోయాను (నవ్వుతున్న ఎమోజీలు)’ అని సమాధానమిచ్చారు. తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. హన్సిక ప్రస్తుతం ‘మహా’, ‘పార్ట్నర్‌’ తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu