బిగ్‌బాస్‌ వార్తలపై స్పందించిన పాయల్‌ రాజ్‌పూత్‌

తెలుగు బిగ్‌బాస్‌-5 లో పాయల్‌ రాజ్‌పూత్‌ పాల్గొనబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఆ వార్తలకు ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించింది. తాను తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి తనను లాగవద్దని ఆమె కోరింది.

టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్‌100’ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. సీత, ఆర్‌డీఎక్స్‌ లవ్, వెంకీ మామ, డిస్కోరాజా, ఏంజిల్‌ వంటి చిత్రాల్లో నటించిందీ చిన్నది‌. తెలుగుతో పాటు పంజాబీ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. కాగా.. గతేడాది వచ్చిన బిగ్‌బాస్‌4లో ఆమె ఒక ప్రత్యేక గీతానికి చిందులేసింది.

CLICK HERE!! For the aha Latest Updates