హన్సిక రక్త స్నానం..!

ఈ మధ్యకాలంలో థ్రిల్లింగ్ సినిమాలు వరసగా వస్తున్నాయి. థ్రిల్లింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు.. తక్కవ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. చేయాల్సిందల్లా ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ అయ్యేలా చూడటమే. తన గ్లామర్ తో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్టైనా హన్సిక.. కోలీవుడ్ లో ‘మహా’ అనే సినిమా చేస్తున్నది.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా హన్సిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హన్సిక సెమి న్యూడ్ గా టబ్ లో కూర్చొని ఉంటుంది. ఆమె చెస్ట్ పై వరకు రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఒక చేత్తో గన్ పట్టుకొని సీరియస్ గా చూస్తున్నట్టున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.