మహేష్‌ బాబు పాటతో రష్మిక టిక్‌టాక్‌ వీడియో.. వైరల్‌


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోయిన్‌ రష్మిక హృదయాన్ని దోచేశాడు. అందుకే ఆయన క్యూట్‌.. స్వీట్‌.. హాట్‌గా ఉన్నాడంటూ పాట పాడుకుంటోంది. మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్‌. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రతి సోమవారం అభిమానులకు కానుక ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే సోమవారం ‘HE’S Soo CUTE’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేయనుంది. తాజాగా రష్మిక ఆ పాటతో టిక్‌టాక్‌ వీడియో చేసి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబులు నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రకాష్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates