
సీనియర్ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమన్యం బులెటిన్ విడుదల చేసింది.
విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని… నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని, అయితే గత 24 గంటల నుంచి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు ఎండీఎంకే పార్టీ కూడా విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసింది. సాధారణ వైద్య పరీక్షల కోసమే విజయకాంత్ ఆసుపత్రిలో చేరారని… ఒకట్రెండు రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వస్తారని తెలిపింది. ఆయనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని విన్నవించింది.













