HomeTelugu Big Storiesమెగా కోడలికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కృతజ్ఞతలు

మెగా కోడలికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కృతజ్ఞతలు

1 10
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తుంటుంది. ఇప్పుడు కూడా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశమంతటా లాక్‌డౌన్‌ విధించడంతో నిరుపేదలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పేదవాళ్లకు నిత్యావసరాలు సాయం చేయడంతో పాటు అపోలో ఫార్మసీల్లో సినిమా కార్మికులకు ఉచితంగా మందుల పంపిణి కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే కరోనాకు బలైపోతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దాంతో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఉపాసన కొత్త ఛాలెంజ్ విసిరింది.

వైద్యులకు కృతజ్ఞతలు చెప్పడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ (WHO) థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ మొదలు పెట్టింది. దానికి ఉపాసన కూడా తన వంతు సహకారం అందిస్తుంది. ఇక్కడ ఈ ఛాలెంట్ మొదలు పెట్టింది ఉపాసన. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ట్విట్టర్‌లో.. తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ కుటుంబాలను కూడా వదిలి మన కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వాళ్లకు సెల్యూట్ అంటూ ఒక వీడియోను ట్వీట్ చేసింది ఉపాసన.

ఈమె చేసిన ట్వీట్‌పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అదోనమ్ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్‌లో మీరు కూడా భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అంటూ రిప్లై ఇచ్చాడు. మీరు ఇండియాలో ఈ ఛాలెంజ్ తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు టెడ్రోస్. మొత్తానికి ఉపాసన మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ ఎంతమంది తీసుకుంటారో చూడాలిక.

Recent Articles English

Gallery

Recent Articles Telugu