బిగ్‌బాస్‌ హౌస్‌లో హెబ్బా పటేల్

‘స్టార్ మా’ అతిపెద్ద రియాల్టి షో తెలుగు బిగ్‌బాస్‌ -3 కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది అయితే ఇప్పటికే కొన్నిపేర్లు ప్రచారంలో ఉన్నాయి. తీన్మార్ సావిత్రి బిగ్ బాస్ షోకి దాదాపు ఖాయం కాగా.. రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్, రఘు మాస్టర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ హంగులు నింపేందుకు హౌస్‌లో అడుగుపెట్టబోతోందట.. టాలీవుడ్ ‘కుమారి’ హెబ్బా పటేల్.

‘కుమారి 21 F’, 24 కిస్సెస్ వంటి చిత్రాల్లో ముద్దుల వర్షం కురిపించి అన్ లిమిటెడ్ ఆరబోతతో బోల్డ్ నటిగా మెప్పించిన హెబ్బా పటేల్.. బిగ్ బాస్‌కి వెళ్లేందుకు సూట్ కేస్ రెడీ చేసిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తే.. ఆట రంజుగా సాగుతుందో అలాంటి టాప్ కంటెస్టెంట్ హెబ్బా అని.. షోకి కావాల్సిన గ్లామర్ హంగులు ఆమె రూపంలో అద్దేందుకు నిర్వాహకులు స్పెషల్ టాస్క్‌లు రెడీ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి సినిమాల్లేక తల్లడిల్లిపోతున్న హెబ్బాకు బిగ్ బాస్ నుండి కాల్ రావడంతో హ్యాపీగా హెబ్బా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 2లోనే హెబ్బాకి ఆఫర్ వచ్చిందట.. అయితే అప్పటికే వరుస సినిమాలు ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాక బిగ్ బాస్ హౌస్‌కి టాటా చెప్పేసిందట. ఇక సీజన్ 2 మిస్ అయినా సీజన్ 3లో బంపర్ ఆఫర్ రావడంతో కుమారి 100 రోజుల పాటు ఎలాంటి రచ్చ చేస్తోంది చూడాలిక.