HomeTelugu TrendingShah Rukh Khan Mannat కారణంగా వ్యాపారాలు నష్టపోతున్నాయా?

Shah Rukh Khan Mannat కారణంగా వ్యాపారాలు నష్టపోతున్నాయా?

Here's how Shah Rukh Khan Mannat is affecting local businesses
Here’s how Shah Rukh Khan Mannat is affecting local businesses

Shah Rukh Khan Mannat:

షారూక్ ఖాన్ – పేరు చెబితేనే అభిమానుల గుండెల్లో ధమాకా! ఆయన బాంద్రాలో ఉన్న మన్నత్ బంగ్లా అంటే ఫ్యాన్స్‌కి పుణ్యక్షేత్రమే. కానీ ఇప్పుడు మన్నత్ ఓ తాత్కాలిక శాంతత్మక స్థలంగా మారింది. కారణం – షారూక్ ఖాన్ తన బంగ్లా రినొవేషన్‌కి ఇచ్చేశాడు. వచ్చే మూడు సంవత్సరాలు మన్నత్‌లో ఉండే ప్రసక్తే లేదు.

ఇప్పుడు షారూక్ కుటుంబం పాలి హిల్‌లోని పూజా కాసా అనే అపార్ట్‌మెంట్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ 1వ, 2వ, 7వ, 8వ ఫ్లోర్స్ మొత్తం లీజ్ తీసుకున్నారు. నెలకు అద్దె? ఏకంగా రూ. 24.15 లక్షలు! ఈ అపార్ట్‌మెంట్ నిర్మాత వాషు భగ్నానీ పిల్లలదే.

మన్నత్ వద్ద శాంతి రాజ్యమే నెలకొంది. ఒకప్పుడు సెల్ఫీలు తీయడానికి వచ్చిన ఫ్యాన్స్ క్యూ కడతే, ఇప్పుడు అక్కడ ఖాళీదనం స్పష్టంగా కనిపిస్తోంది. మన్నత్ దగ్గర ఉన్న చిన్న చిన్న వ్యాపారాలకు ఇది పెద్ద షాక్. “ఇప్పుడు షారూక్ ఇక్కడ ఉండడంట విన్నాక ఎవ్వరూ రావట్లేదు,” అంటూ ఓ ఐస్‌క్రీమ్ విక్రేత బాధపడ్డాడు. “షారూక్ ఉంటే మన్నత్‌కీ విలువ ఉంటుంది, లేనప్పుడు ఎవ్వరికీ ఆసక్తి ఉండదు,” అని ఇంకో వ్యక్తి అన్నాడు.

మన్నత్ అంటే షారూక్ కల. 1997లో కలగా మొదలై, 2001లో నెరవేరింది. 2005లో దీనికి ‘మన్నత్’ అని పేరు పెట్టాడు. ఇప్పుడు దీని విలువ దాదాపు రూ. 200 కోట్లు!

ఇదిలా ఉండగా, షారూక్ మాత్రం ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్నాడు. కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి “కింగ్” అనే సినిమా చేస్తున్నాడు. ఇది బాగా హైప్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu