స్నేహ భర్త మెగాహీరోకి విలన్ అయ్యాడు!

నిన్నటి తరం కథానాయిక స్నేహ భర్త ప్రసన్న తమిళంలో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొన్నామధ్య ఓ సినిమాలో విలన్ గా కూడా కనిపించాడు. తాజాగా ఆయన ఓ తెలుగు సినిమాలో విలన్ గా కనిపించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం! సాయి ధరం తేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ సినిమా రూపొందుతోంది.

నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ సినిమాలో విలన్ గా ప్రసన్నను తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. దానికి ప్రసన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోలు సైతం విలన్స్ గా మారడానికి మక్కువ చూపుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రసన్న కూడా హీరోగా నటిస్తున్నప్పటికీ విలన్ గా కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. మరి ఈ హీరో విలన్ గా ఏ మేరకు మెప్పిస్తాడో.. చూడాలి!