HomeTelugu Trendingఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. రామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. రామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

9 13
ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత మాస్ అడియన్స్‌కు రామ్ మరింత దగ్గరైయ్యాడు. ఈ సినిమా చాలా కాలం తరవాత రామ్ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక రామ్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. తన బర్త్‌డే ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద పండుగలా జరిపారు. సోషల్ మీడియాలో రామ్ పేరు మారుమోగింది. దీంతో రామ్ పోతినేని తన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు చెప్తూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ”నా ప్రియమైన అభిమానులారా.. మీరంతా నాకు ఉన్నారని ఈ ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు మీరు నా కోసం తిండి తినలేదని కనీసం రాత్రంతా నిద్ర కూడా పోలేదని నేను విన్నాను.. నిజంగా టచ్ చేశారు.. మీ అందరూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి’ అని ట్వీట్ చేశాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu