HomeTelugu Trendingఎలాంటి హంగులు లేకుండా ఉండాలి: రష్మిక

ఎలాంటి హంగులు లేకుండా ఉండాలి: రష్మిక

Rashmika mandanna reply to

టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తరువాత బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ సోషల్‌ మీడియాకి యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో తరచు తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈమెకి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఓరెంజ్‌లో ఉంది.

ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్‌ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్‌ గ్యాప్‌లో సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో రష్మిక తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ‘మీరు స్మోక్‌ చేస్తారా?’ అని ఓ నెటిజన్‌ అడిగితే, ‘‘నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్‌ అంటే అసహ్యం. స్మోక్‌ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’ అని చెప్పింది. మరో నెటిజన్‌ ‘నన్ను పెళ్లి చేసుకోండి’ అని అడగ్గా.. కనీసం ప్రపోజల్‌ అయినా మంచిగా చెయ్యొచ్చు కదా అని మూతి తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక మరో నెటిజన్‌ ఒక అడుగు ముందుకేసి.. మీ భర్త ఎలా ఉండాలనే అడగ్గా.. దానికి సమాధానంగా రష్మిక సమాధానంగా.. ‘మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి’అని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!