ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా: వైష్ణవ్‌ తేజ్‌

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌. తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ బద్దలు కొట్టాడు. వైష్ణవ్‌.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ‌ఫస్ట్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్‌ హీరో తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్‌.

ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్‌ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్‌ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు.

సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్‌ అడగ్గా.. ఫ్యామిలీ మేన్‌-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్‌ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్‌ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్యతో మరో సినిమా చేయనున్నట్లు తెలిపాడు.

CLICK HERE!! For the aha Latest Updates