HomeTelugu Trendingపెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

Hero sumanth ashwin will ma

టాలీవుడ్‌ మరో హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. హీరో సుమంత్‌ అశ్విన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా నేపధ్యంలో తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్‌లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే. టాలీవుడ్‌లో సుమంత్‌ తన తండ్రి ఎమ్‌ఎస్‌ రాజు డైరెక్షన్‌లో వచ్చిన ‘తూనీగ తూనీగ’ సినిమాతో పరిచయమైయ్యాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ'(రైడర్స్‌ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu