HomeTelugu Trendingనరేష్‌- పవిత్రాల 'మళ్లీ పెళ్లి'

నరేష్‌- పవిత్రాల ‘మళ్లీ పెళ్లి’

Naresh Pavitra MalliPelli m

నరేష్ పవిత్రా లోకేష్ ఇద్దరూ సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. వీరిద్దరి ప్రేమ, సహజీవనం గురించి సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఆ మధ్య లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో వైరల్ కాగా ఇటీవలే పెళ్లి వీడియో షేర్‌ చేసి నెటిజన్లకు పిచ్చెక్కించేశారు.

తాజాగా ‘మళ్లీ పెళ్లి’తో మన ముందుకొచ్చారు ఈ జంట. అసలు విషయం ఏంటంటే.. నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తీస్తున్నారు. నరేష్ తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయ కృష్ణ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. గోల్డెన్ జూబ్లీ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనున్నారు.

నరేష్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీర్చిదిద్దుతున్నారు. ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నరేష్ పవిత్ర ఇద్దరూ కనిపిస్తున్నారు.

Update on Naresh Pavitra MalliPelli

ఈ పోస్టర్‌లో ఈ కొత్త జంట వైట్ కలర్ బట్టల్లో మెరిసిపోతున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు, కన్నడ, ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్

నేపథ్యంలో వీరిద్దరి ‘పవిత్ర’ బంధం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెళ్లి వీడియో షేర్‌ చేసినప్పుడే ఇది సినిమా ప్రమోషన్‌ అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే నిజం అయింది. మరి వీరి ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ప్రేక్షకులు ఎంత వరకు యాక్సెప్ట్‌ చేస్తారో చూడాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu