కుర్రహీరో కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లే!

మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగింది నిర్మాత ఎమ్మెస్ రాజు సినిమాలతోనే.. ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ వంటి హీరోలకు కూడా గుర్తింపు లభించింది రాజు గారి సినిమాల ద్వారానే.. ఇంతమంది హీరోలకు లైఫ్ ఇచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టడానికి నానాతంటాలు పడుతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో కొడుకు సుమంత్ అశ్విన్ ను ‘తూనీగ తూనీగ’ చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. అది కాస్త బోల్తా కొట్టింది. ఆ తరువాత సుమంత్ కు ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో సక్సెస్ వరించింది. కానీ దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. మధ్యలో వేరే హీరోలతో కలిసి చేసిన ‘కేరింత’ సక్సెస్ అయింది కానీ సోలో హీరోగా సుమంత్ చేసిన చిత్రాలకు మాత్రం ఆదరణ లభించలేదు. 
గతేడాది అతడు నటించిన ‘కొలంబస్’ సినిమా విడుదలైంది.. పోయింది.. కూడా తెలియలేదు. రీసెంట్ గా వంశీ దర్శకత్వంలో నటించిన ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. సుమంత్ యాక్టింగ్ మీద సైతం విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ‘ఎందుకిలా’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దానికి మంచి పేరు రావడంతో ఇక ఈ హీరో వెబ్ సిరీస్ కు పరిమితమైపోతాడేమో.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.