ఫ్యాషన్ డిజైనర్ రెండో పాట విడుదల!

ముప్పై సంవత్సరాల క్రితం సంచలన విజయాన్ని అందుకున్నే ‘లేడీస్ టైలర్’ చిత్రనిర్మాత స్రవంతి రవికిషోర్ ఇప్పుడు ఆ లేడీస్ టైలర్ సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ రెండవ పాటను విడుదల చేశారు. ‘రవివర్మ చిత్రమా’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా, శ్రీకృష్ణ, హరిణి ఇవటూరి పాడారు. ఈ సంధర్భంగా..
స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. ”వంశీ గారి దర్శకత్వంలో నేను నిర్మించిన లేడీస్ టైలర్ అప్పుడు ఒక సెన్సేషన్. నేను నిర్మాతగా అది మొదటి చిత్రం. ఇప్పుడు ముప్పై ఏళ్ళ తరువాత మళ్ళీ వంశీ గారి దర్శకత్వంలో సీక్వెల్ రావడం చాలా త్రిల్లింగ్ గా ఉంది. మణిశర్మ గారి సంగీతం బావుంది. గోదావరి అందాను వంశీ గారు చిత్రీకరించినట్లుగా మరెవరూ చేయలేరు” అన్నారు. 
మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా వేసవి కాకుండా మే మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన మొదటి పాట ప్రేక్షకాదరణ పొందింది.