HomeTelugu Big Storiesవంశీ కోసం కమెడియన్ కథ!

వంశీ కోసం కమెడియన్ కథ!

సీనియర్ దర్శకుడు వంశీ మంచి కథకుడు. ఆయన సినిమాల కంటే కథలు చాలా బావుంటాయనేది అందరి అభిప్రాయం. ఆయన దగ్గర కథలకు కొరత ఉండదు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయట రచయితల కథలతో సినిమాలు చేస్తుంటాడు. రీసెంట్ గా చేసిన ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ సినిమా కథ కూడా వంశీది కాదు. ఇప్పుడు మరోసారి ఆయన బయట కథతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఆయనకు కథ అందిస్తోంది కమెడియన్ కృష్ణభగవాన్. వంశీతో కృష్ణభగవాన్ కు మంచి ర్యాపో ఉంది.
కృష్ణభగవాన్ ను వెండితెరకు పరిచయం చేసింది వంశీనే. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో కృష్ణభగవాన్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు. అప్పటినుండి ఆయన కెరీర్ కు ఢోకా లేకుండా సాగింది. ఆ అనుబంధంతో కృష్ణభగవాన్ తన కథను వంశీకి అందించినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ కథ ఇప్పటిది కాదు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. అప్పటినుండి ఆ కథ అలానే ఉంది. ఇప్పుడు ఆ కథనే వంశీ చేతిలో పెట్టాడు కృష్ణభగవాన్. మరి ఈ కథను ముందు అనుకున్నట్లుగా అల్లరి నరేష్ తో చేస్తారా..? లేదంటే మరో హీరోను తీసుకుంటారనే..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది.
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu