HomeTelugu Trendingమీరా జాస్మిన్‌ రీఎంట్రీ

మీరా జాస్మిన్‌ రీఎంట్రీ

Heroine Meera Jasmine re en
టాలీవుడ్‌లో ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో పరిచయమైన హీరోయిన్‌ మీరా జాస్మిన్. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌, బాలకృష్ణ, జగపతిబాబు, రవితేజ సరసన కూడా ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ సినిమాలను ఎక్కువగా చేసిన మీరా జాస్మిన్, వివాహమైన తరువాత సినిమాలకు దూరమైంది. తాజాగా ఈమో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొంత గ్యాప్ తరువాత ఒక మలయాళ సినిమాలో అతిథి పాత్రలో చేసిన ఆమె, ఇక పూర్తి స్థాయిలో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. ఆ తరువాత ఆమె అంగీకరించిన చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించనున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇక ఆమె తన స్థాయికి తగిన పాత్రలు చేయడానికి సిద్ధమనే సంకేతాలను టాలీవుడ్ కి కూడా పంపుతోందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!