HomeTelugu Trending'హాయ్‌ నాన్న' టీజర్‌ అప్డేట్

‘హాయ్‌ నాన్న’ టీజర్‌ అప్డేట్

hi nanna teaser updateటాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ (డెబ్యూ డైరెక్టర్‌) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని 30 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ అప్‌డేట్ అందించారు. ఈ మూవీ టీజర్‌ను అక్టోబర్‌ 15న ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు.

నాని, మృణాళ్‌ఠాకూర్‌ రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాయ్‌ నాన్నలో మృణాళ్‌ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోంది.

మేకర్స్‌ ఇప్పటికే హాయ్‌ నాన్న నుంచి లాంఛ్‌ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. హాయ్‌ నాన్న మ్యూజికల్ ట్రీట్‌ అద్భుతంగా ఉండబోతుందని సమయమా, గాజుబొమ్మ పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సను జాన్‌ వర్గీస్‌ ఐఎస్‌సీ కెమెరామెన్‌. జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల తర్వాత కెమెరామెన్‌ సను జాన్‌ వర్గీస్‌ ఐఎస్‌సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!