రామ్‌ చరణ్‌ నెక్ట్స్‌ మూవీ అతనితోనేనట..


మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో గానీ, అట్లీకుమార్ .. త్రివిక్రమ్ తో గాని ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ ముగ్గురు దర్శకులలో ముందుగా ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక చరణ్ విషయానికొస్తే, సందీప్ రెడ్డి వంగా .. హరీశ్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ .. సాయితేజ్ .. అల్లు అర్జున్ లతో హరీశ్ శంకర్ సినిమాలు చేశాడు. అందరికీ ఆయన మంచి హిట్స్ ఇచ్చాడు. అందువలన చరణ్ ఆయనకే మొదటి ప్రాధాన్యతను ఇవ్వొచ్చని చెబుతున్నారు. చరణ్ కి సంబంధించిన కథపైనే హరీశ్ శంకర్ కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates