బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి: హిందూ మక్కల్ కచ్చి!

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలకు పెట్టింది పేరు. హిందీ, కన్నడలో సక్సెస్ అయిన ఈ షోను ఇటీవల కమల్ హాసన్ వ్యాఖ్యాతగా అట్టహాసంగా మొదలుపెట్టారు. అయితే అప్పుడే ఈ షోను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ షోను రద్దు చేయాలని, హోస్ట్ అయిన కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ మక్కల్ కచ్చి అనే స్వచ్ఛంద సంస్థ. షోలో పోటీదారులు ఉపయోగించే భాష, వారి వస్తాధారణ అసభ్యకరంగా ఉంటున్నాయని ముఖ్యంగా నమిత, ఓవీయాలు ధరించే దుస్తులు హిందూ సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆ సంస్థ చెబుతోంది.

ఇక గంజ కురుప్పు, హారతిలు ఉపయోగించే భాష తమిళ హిందీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని వెంటనే వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగులో బిగ్ బాస్ షో మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో మీద ఎన్ని వివాదాలు ఏర్పడతాయో.. చూడాలి!