‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో ‘హిప్పీ’ మూవీ ట్రైలర్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ తో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ త్వరలో ‘హిప్పీ’ గా అలరించబోతున్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దిగాంగన సూర్యవన్షి హీరోయిన్‌. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇప్పటివరకూ విడుదలైన ట్రైలర్‌లను చూస్తుంటే సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ‘ఓటుకు నోటు గావాలె.. మంచి ప్రభుత్వం గావాలె అనుకోవడం ఎంత గలాత్తో.. మంచి గర్ల్‌ ఫ్రెండ్‌ గావాలె.. జిందంగీ సుఖంగా ఉండాలె అనుకోవడం కూడా అంతే తప్పు’ అంటూ జేడీ చక్రవర్తి హితబోధ చేస్తూ కనిపించారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నివాస్‌ కె.ప్రసన్న స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ ‘హిప్పీ’ ఏకకాలంలో విడుదల కానుంది.