HomeTelugu Trendingచిరంజీవి, రామ్‌ చరణ్ లపై తేనెటీగల దాడి.. 

చిరంజీవి, రామ్‌ చరణ్ లపై తేనెటీగల దాడి.. 

4 29మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబం హాజరైంది. ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ఆ ప్రమాదం నుంచి తప్పించారు. ఈ దాడిలో చిరు చరణ్‌లతో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను ఇవాళ (మే 31,2020) నిర్వహిస్తున్నారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఇవాళ దోమకొండకు వచ్చారు. అయితే అక్కడే ఉన్న మరికొంత మందిని తేనేటీగలు కుట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది సేపటి అనంతరం తేనేటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!