
Vicky Kaushal Chhaava:
హౌస్‌ఫుల్ 5 పేరు వినగానే మనకు సరదా, కుటుంబంతో చూసే కామెడీ సినిమా గుర్తుకువస్తుంది. కానీ ఈ సారి వచ్చిన హౌస్‌ఫుల్ 5 ఆ అంచనాలకు చేరలేకపోయింది. జూన్ 6న విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అసౌకర్యంగా అనిపించే విధంగా చాలావరకు ఓవర్ గానే తీసినట్టుగా ఫీల్ అయింది.
ముందటి పార్ట్స్ అన్నీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ హాస్యంతో అందరినీ ఆకట్టుకున్నా, ఈసారి మాత్రం వల్గారిటీ ఎక్కువగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. అందుకే పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తొలి రోజు కలెక్షన్లు ₹22 కోట్లు రాబట్టినప్పటికీ, ఫ్రాంచైజీ స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు.
View this post on Instagram
ఇదే సమయంలో విక్కీ కౌశల్ నటించిన చావా అనే చారిత్రక చిత్రం మొదటి రోజే ₹29 కోట్లు కొల్లగొట్టింది. ఇది ఒక ఫ్రాంచైజీ కూడా కాదు. ఇక, సికందర్ అనే మరో చిత్రం నెగటివ్ రివ్యూస్ వచ్చినా, ఆదివారం రిలీజ్ కావడంతో డీసెంట్ ఓపెనింగ్ దక్కించుకుంది.
ఈ పరిస్థితుల్లో స్టార్ పవర్ కంటే కంటెంట్ ఎక్కువ పనిచేస్తోంది అన్న మాట నిజమవుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనం, బాగా చెప్పిన కథల వైపే వెళ్తున్నారు.
త్వరలో రాబోతున్న సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాపై అజయ్ దేవగన్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అదే హిట్ అయితే ఓ రేంజ్ ఉంటుంది, కానీ అదే ఫెయిలైతే… ఇక పాత స్టార్‌ల నుంచి నమ్మక తగ్గిపోతుంది.
ఇక షారుఖ్ ఖాన్ కూడా 2026లో కొత్త సినిమా తీసుకొస్తున్నారని బజ్. ఆయన మళ్లీ గోల్డెన్ పీరియడ్ మ్యాజిక్ తీసుకురాగలరా అనేది చూడాలి.
ALSO READ: Hari Hara Veera Mallu బడ్జెట్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..