
Housefull 5 Dual Climax:
బాలీవుడ్‌లో ఒక వినూత్న ప్రయోగం జరుగుతోంది. ఇప్పటివరకు మనం ఒక సినిమాకి ఒక క్లైమాక్స్ చూసుంటాం. కానీ హౌస్‌ఫుల్ 5 అనే సినిమా మాత్రం రెండు వేరే వేరే క్లైమాక్స్‌లతో థియేటర్లలోకి వచ్చేసింది! ఇది భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి జరుగుతోంది.
హౌస్‌ఫుల్ 5A మరియు హౌస్‌ఫుల్ 5B అని రెండు వర్షన్లు రిలీజ్ అయ్యాయి. రెండు కథలు ఒకేలా మొదలవుతాయి – ఓ 20 ఫ్లోర్ల క్రూజ్‌పై ముగ్గురు వ్యక్తులు – అంతా ఒకే వారసులమంటూ గొడవపడుతుంటారు. అంతలో ఓ హత్య జరుగుతుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే… ఏ వర్షన్ చూస్తే, దానిలో కిల్లర్ వేరే వాళ్ళే!
View this post on Instagram
5Aలో ఒకరు, 5Bలో ఇంకొకరు… అదే కథకి రెండు ముగింపులు. అదే నటులు, అదే సెటప్ – కానీ కిల్లర్ మాత్రం మారిపోతాడు. ఇది ప్రేక్షకులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చే పంథాలో ఉన్న సినిమా.
ఈ ప్రయోగానికి CBFC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని థియేటర్లు 5Aను చూపిస్తే, మరికొన్ని 5Bని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని థియేటర్లు రెండింటినీ వేరే టైంల్లో ప్రదర్శిస్తున్నాయి. అంటే మీరు రెండు వర్షన్లు చూసేయొచ్చు.
ఇంత భారీ ప్రయోగానికి తగ్గట్టే స్టార్ కాస్ట్ కూడా పెద్దది: అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, నానా పటేకర్… మొత్తం 24 మంది నటులు! హాస్యం, మిస్టరీ, మర్డర్, ఎంటర్టైన్‌మెంట్ – అన్నీ కలిపిన 2 గంటల 45 నిమిషాల సినిమా ఇది.
ALSO READ: IPL 2025 Final: RCB ప్లేయర్ల నెట్ వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..













