
IPL 2025 Final RCB:
ఈసారి కప్పు మాది కావాలంటే! RCB ఫైనల్ లోకి ఎంట్రీ – ప్లేయర్ల నెట్‌వర్త్ చూసి షాక్ అవుతారు!
ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) అదరగొట్టేసింది. ముల్లాన్పూర్ లో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) మీద 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రాజత్ పటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నిర్ణయం మ్యాచును మార్చేసింది. పంజాబ్ కింగ్స్ కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
RCB హిస్టరీ చూస్తే ఇప్పటివరకు 10 సార్లు ప్లేఆఫ్‌కి చేరింది. 2009, 2011, 2016లో ఫైనల్‌కి వెళ్లినా ట్రోఫీ మాత్రం మిస్సయ్యింది. కానీ ఈసారి పరిస్థితి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఫుల్ హోప్ లో ఉన్నారు. ఇప్పటి వరకు 16 ప్లేఆఫ్ మ్యాచుల్లో 6 విజయాలు సాధించారు.
ఇప్పటి RCB టీంలో సూపర్ టాలెంట్స్ తో పాటు నెట్‌వర్త్ కూడా గగనాన్న టచ్ అవుతోంది. చాలామంది ప్లేయర్లు కోట్ల రూపాయల సంపత్తి కలిగివున్నారు. ఓ లుక్కేయండి:
విరాట్ కోహ్లీ – రూ. 1,050 కోట్లు
ఫిల్ సాల్ట్ – రూ. 24.8 కోట్లు
మయాంక్ అగర్వాల్ – రూ. 80 కోట్లు
రాజత్ పటిదార్ – రూ. 17 కోట్లు
టిమ్ డేవిడ్ – రూ. 42 కోట్లు
జితేష్ శర్మ – రూ. 13-14 కోట్లు
రొమారియో షెపర్డ్ – రూ. 25 కోట్లు
క్రునాల్ పాండ్యా – రూ. 75 కోట్లు
భువనేశ్వర్ కుమార్ – రూ. 75 కోట్లు
యష్ దయాల్ – రూ. 7 కోట్లు
జోష్ హేజిల్వుడ్ – రూ. 90 కోట్లు
నువాన్ తుషార – రూ. 6 కోట్లు
సుయాష్ శర్మ – రూ. 5 కోట్లు
ALSO READ: Pawan Kalyan రాజకీయాల్లోకి ఎందుకు రావడానికి కారణం ఒక్క సినిమానా!