
Chiranjeevi Vishwambara release date:
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమా మీద మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడిదే సినిమా రిలీజ్ డేట్ చుట్టూ గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు మెగా సినిమాలకు రిలీజ్ విషయంలో చిరంజీవికి క్లారిటీ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం విస్తృతంగా అనేక ఊహాగానాలు చుట్టుముడుతున్నాయి.
టాలీవుడ్ మీడియాలో జూలై 24న విడుదల అవుతుందని ప్రచారం జరిగినా, చిత్రబృందం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు కారణం ఏమిటంటే, సినిమాలోని గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తవ్వలేదు. చిరంజీవి స్వయంగా కొన్ని VFX సీన్స్ ఫైనల్ చేయాల్సి ఉంది. ఆ పనులు పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ ఖరారు చేస్తారు.
ఇక హిందీ హక్కులు ఇప్పటికే రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి. కానీ డిజిటల్, శాటిలైట్ హక్కులు ఇంకా సెట్ కావలసి ఉంది. ఈ డీల్స్ క్లోజ్ అయితే మిగతా బిజినెస్ దాదాపు పూర్తవుతుంది. దీంతో నిర్మాతలకు పెట్టుబడి తిరిగి రావచ్చు.
ఇక ఇప్పటివరకు వినిపిస్తున్న మరో ప్రచారం ప్రకారం, ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం, విశ్వంభర ఈ ఏడాది కూడా రాకపోవచ్చని అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ లో భయం మొదలైంది.
వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సొషియో ఫాంటసీ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. అన్ని భాషల్లో సమన్వయంతో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాకు సరిగ్గా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
ALSO READ: ప్రపంచంలోనే Most Expensive Music Video ఎవరు తీసారో తెలుసా?