HomeTelugu Trendingకంచరపాలెం దర్శకుడి తాజా సినిమా లిరికల్ సాంగ్

కంచరపాలెం దర్శకుడి తాజా సినిమా లిరికల్ సాంగ్

10 5
కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. హీరో సత్యతో కలిసి సినిమా రూపొందిస్తున్నాడు. `ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో కంచరపాలెం సినిమా తెరకెక్కించిన దర్శకుడు వెంకటేష్ ఆ సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు వెంకటేష్ తాజా సినిమా కూడా పల్లెటూరి ఫొటోగ్రాఫర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమానుంచి ఓ అందమైన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు. `నింగి చుట్టే మేఘం` అంటూ సాగే ఈ గీతాన్ని విజయ్ ఏసుదాసు ఆలపించారు. అచ్చం ఏసుదాసు లా విజయ్ ఈ పాటను అద్భుతంగా పాడారనిపిస్తోంది. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu