HomeTelugu Trendingకార్తికేయ-2 సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్స్

కార్తికేయ-2 సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్స్

Karthikeya 2 rights

యంగ్‌ హీరో నిఖిల్ కార్తికేయ-2పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానున్న కార్తికేయ-2 సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల వరకు డీల్ కుదిరనట్టు వార్తలు వస్తున్నాయి. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ధర పలకడం గొప్ప విషయం. చందు ముండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించారు. 2014లో వ‌చ్చిన‌ కార్తికేయ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

అర్జున్ సురవరం తర్వాత దాదాపు మూడేళ్లు బ్రేక్‌ తీసుకున్న నిఖిల్‌ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ 4 సినిమాలకు సైన్ చేశాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైర‌వ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!