HomeTelugu Big Stories'హంగామా2' ట్రైలర్‌

‘హంగామా2’ ట్రైలర్‌

Hungama 2 trailer
బాలీవుడ్‌లో 2003లో విడుదలైన ‘హంగామా’ సీక్వెల్స్‌ ‘హంగామా2’ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శన్ డైరెక్షన్‌ వహించిన ఈ సినిమాలో శిల్పాశెట్టి, పరేశ్‌రావల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ‘హంగామా2’ జులై 23న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. కాగా చిత్ర ట్రైలర్‌ను బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా గురువారం విడుదల చేశారు. ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పిన అక్షయ్‌.. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘హంగామా2’ ట్రైలర్ ఫన్నీగా సాగింది. ప్రణీత సుభాష్ బిడ్డకు తండ్రి ఎవరనే చర్చతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఆ బిడ్డతో తనకే సంబంధం లేదని చర్చలు సాగుతుండటం ఇలా ఒకరి భర్తతో ఇంకొకరి భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు తలెత్తుతాయి. అసలు ఏం జరుగుతోందోనన్న తెలియని గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రేక్షకులు కడుపునిండా నవ్వడం ఖాయమని చిత్రబృందం పేర్కొంది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీనస్‌ వరల్డ్‌వైడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రతన్‌ జైన్‌, గణేశ్‌జైన్‌, చేతన్‌జైన్‌, అర్మాన్‌ వెంచర్స్‌ నిర్మించారు. రోనీ రఫెల్‌, అనుమాలిక్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!