ఇది నా బర్త్ డే కాదు.. ఆర్జీవీ వైరల్‌ ట్వీట్‌

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ రోజు… ఏప్రిల్ 7 రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లకు వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్‌ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ఏడుపుమొహం ఎమోజీలను పోస్ట్‌ చేశాడు అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ హర్రర్ థ్రిల్లర్ ఆర్‌జివి దెయ్యం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇది ఏప్రిల్ 16 న పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు.

CLICK HERE!! For the aha Latest Updates