HomeTelugu Trendingనాగార్జునకు 30 ఏళ్లు నిండలేదట!

నాగార్జునకు 30 ఏళ్లు నిండలేదట!

7 27హీరో అక్కినేని నాగార్జునకు ఇంకా 30 ఏళ్లు నిండలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నాగ్‌ హీరోగా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాగ్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 59 ఏళ్ల వయసులో కొత్త జనరేషన్‌ స్క్రిప్టుల్లో ఎలా నటిస్తున్నారు? అని విలేకరి ప్రశ్నించారు.

దీనికి నాగ్‌ స్పందిస్తూ.. ‘నాకింకా 30 ఏళ్లు నిండలేదు. నిజంగా నేను ఇలానే ఆలోచిస్తుంటా, అనుకుంటుంటా. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. నా వయసులో సగం ఉన్న వారితో చాలా సౌకర్యంగా వ్యవహరిస్తుంటా. కానీ నా తోటి వయసు వారితో సౌకర్యంగా ఉండలేను. ఎందుకంటే వారంతా అనారోగ్య సమస్యల గురించి, ఎలాంటి మందులు వేసుకోవాలనే విషయం గురించి మాట్లాడుతుంటారు. నాకు వాటిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. నాకు ఓ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మేమెప్పుడు కలిసినా వీటి గురించి చర్చించుకోం. ‘నువ్వు యంగ్‌గా ఉన్నావు’ అని జనాలు నాతో అంటే నాకు చిరాకు వస్తుంది. నిజమే నేను యంగ్‌.. అది నా స్వభావం. ‘ఉదయాన్నే అలాంటి వ్యాయామం చేయాలి, ఇలాంటి డైట్‌ పాటించాలి’ అని యువకులు నాతో చెబుతుంటే వినాలి అనిపిస్తుంది. అలాగే మార్కెట్‌లోకి ఎలాంటి గ్యాడ్జెట్స్‌ వచ్చాయి, వాటిని ఎలా ఉపయోగించాలి అని కూడా చెబుతుంటారు. నా ఐఫోన్‌ను ఇంకా బాగా ఎలా వినియోగించుకోవచ్చో నేర్పిస్తుంటారు. అలాంటివి నాకు ఆసక్తి’ అని నాగ్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!