HomeTelugu News200 సార్లు కన్నుకొట్టి.. ఇంకా అంటే బోర్..!

200 సార్లు కన్నుకొట్టి.. ఇంకా అంటే బోర్..!

3 30ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ ఎవరైనా కన్నుకొట్టమని అడిగితే బోరింగ్‌గా అనిపిస్తుంటుందని అంటున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన మూవీ ‘ఒరు అడార్‌ లవ్‌’. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ గా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రియ ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు.

‘నేను కన్నుకొట్టిన వీడియో ఇంత వైరల్‌గా ఎలా మారిందో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే కన్నుకొట్టమని అడుగుతారు. అలా అడిగిన ప్రతీసారి నాకు చిరాకు కలగదు కానీ బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఇప్పటివరకు దాదాపు 200 సార్లు కన్నుకొట్టి ఉంటాను. ఈ సినిమాతో నా జీవితంలో పెను మార్పులేమీ జరగలేదు. నా విషయంలో అన్ని జాగ్రత్తలు మా అమ్మే తీసుకుంటుంది. నేను ఇప్పటికీ మిడిల్‌ క్లాస్‌ అమ్మాయినే. కాలేజ్‌కి లోకల్‌ బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్టపడతాను. కానీ ప్రైవసీని కోల్పోయిన మాట నిజమే. ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు’

‘కన్నుకొట్టిన వీడియోపై ఎన్నో ట్రోల్స్‌, కామెంట్స్‌ కూడా వచ్చాయి. కానీ నేనున్న ఇండస్ట్రీ అటువంటింది. పబ్లిక్‌ ఫిగర్‌ అయినప్పుడు ఇవన్నీ భరించాల్సిందే. ‘ఒరు అడార్‌ లవ్’ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది. నాకు కాస్త కంగారుగా ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. వెంట వెంటనే సినిమాలకు ఒప్పుకోవడంలేదు. విజయ్‌ సేతుపతి, దర్శకుడు అట్లీకి వీరాభిమానిని. వారిద్దరితో కలిసి పనిచేయాలనుంది. ప్రత్యేక గీతాల్లో నటించడానికి కూడా సిద్ధమే. కానీ ఈ విషయంలో నాకు ఎవరైనా శిక్షణ ఇవ్వాలి’ అని వెల్లడించారు ‘వింక్‌ గర్ల్‌’.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!