HomeTelugu Trendingకత్రిన బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌

కత్రిన బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌

Katrina Kaif Playing Cricketబాలీవుడ్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ చక్కటి అందం, అభినయం, డ్యాన్స్‌తో ఇండస్ర్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెలో మరో ప్రతిభ కూడా ఉంది. కత్రిన క్రికెట్‌ చాలా బాగా ఆడగలరట. ‘భారత్‌’ సెట్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా తీసిన వీడియోను కత్రిన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘భారత్‌’ సినిమా షూటింగ్‌ పూర్తైన తర్వాత ఇలా సరదాగా ఆడినట్లు పేర్కొన్నారు. ప్రపంచ కప్‌ దగ్గరపడుతోందని, క్రికెట్‌లో మెలకువలు నేర్పమని టీమిండియా కెప్టెన్‌కు (విరాట్‌ కోహ్లీ) కాస్త చెప్పమంటూ అనుష్క శర్మను కత్రిన కోరారు. కానీ మొత్తానికి తనేమీ‌ బ్యాడ్‌ ఆల్‌ రౌండర్‌ను కాదని కత్రిన పోస్ట్‌ చేశారు. దీంతోపాటు మనకూ టైమ్‌ వస్తుంది అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.

ఈ వీడియోలో కత్రిన బ్యాంటింగ్‌ చేస్తూ బంతిని బౌండరీ దాటించారు. ఆమె ఆడే తీరుకు సోషల్‌మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. కత్రినలో చాలా నైపుణ్యం ఉందని అభినందించారు. ‘అద్భుతంగా ఆడుతున్నారు, భారత మహిళా క్రికెట్‌ జట్టుకు మరో క్రీడాకారిణి దొరికినట్లుంది, అద్భుతం‌‌..’ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

‘భారత్‌’ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ హీరో పాత్ర పోషిస్తున్నారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌లు పాత్రల్లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జఫార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కత్రిన విభిన్న పాత్ర, లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెట్‌లో తీసిన ఆమె స్టిల్స్‌ బయటికి వచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!