HomeTelugu Trendingవీడియోలు, మార్ఫింగ్ ఫోటోల తో వేధిస్తున్నారు

వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల తో వేధిస్తున్నారు

5 27
సినీనటి కరాటే కల్యాణి ఓ వీడియో విడుదల చేసిన తర్వాత ఆమెను టార్గెట్‌ చేసుకున్నారు ఆగంతకులు… మత మార్పిడులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆవేశంగా మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు కరాటే కల్యాణి.. దాంతో.. ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె సినిమాల్లో నటించిన వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో వదులుతున్నారట.. దీంతో నివ్వెరపోయిన కల్యాణి.. పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. తన వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. నేను ఏ మతాన్ని కించపరిచేలా మాట్లాడలేదన్న ఆమె.. అవతలి వ్యక్తులు హిందూ మతాన్ని, హిందూ దేవతలను కించపరిచే లాగా పోస్టులు పెట్టారు.. ఆ పోస్టులపై మాత్రమే నేను స్పందించానని చెప్పుకొచ్చారు.

నటిగా నేను చేసిన క్యారెక్టర్‌లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కరాటే కల్యాణి.. ఇక, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోల కింద మాటల్లో చెప్పలేనంత అసభ్యంగా కామెంట్లు రాస్తున్నారని వాపోయారు. ఇలాంటి పోస్టులు పెట్టినంత మాత్రాన తాను భయపడేది లేదని స్పష్టం చేసిన ఆమె.. తనపై చేసిన పోస్టులకు సంబంధించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశానని.. వారెవరు అనేది దర్యాప్తులో తేలుతుంది… వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా చేసిన పోస్టుల పై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా భోగం కల్యాణి పేరుతో సోషల్ మీడియాలో తనపై అసభ్య పోస్టులు పెడుతున్నారు.. నా దగ్గర ఉన్న ఆధారాలను అన్నిటినీ సైబర్ క్రైమ్ పోలీసులకు అందించానని కల్యాణి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu