HomeTelugu TrendingSSMB29: మహేష్‌,జక్కన్న మూవీకి ఇంట్రస్టింగ్‌ టైటిల్‌

SSMB29: మహేష్‌,జక్కన్న మూవీకి ఇంట్రస్టింగ్‌ టైటిల్‌

Interesting title for Mahes

SSMB29: దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను తెచ్చకున్న రాజమౌళి కొత్త సినిమా కోసం కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయితో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈక్రమంలో మహేశ్-జక్కన్న కాంబినేషన్ పై ఇప్పటికే ఓరెంజ్‌లో అంచనాలున్నాయి. మహేష్ బాబు SSMB 29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమా గురించి తరుచూ ఎదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడతునే ఉంది. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఈమూవీ నటించిబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికను కూడా రాజమౌళి ప్రారంభించాడు. ఈక్రమంలో ఈ సినిమా టైటిల్‌ గురించి ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఈ చిత్రానికి మహారాజా అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్‌. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ కావటంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని అధికారికంగా ప్రకటించలేదు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు న్యూలుక్‌లో కనిపించనున్నారు. మార్చిలో ఈమూవీ షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

ఇటీవల మహేశ్ నటించిన సినిమాలు సర్కారువారిపాట, గుంటూరు కారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడాయి. దీంతో ఆయన రాజమౌళితో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మహేశ్ సైతం ఇదే ఫస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుండటం కూడా దీంతో మహేశ్‌కు కూడా ప్లస్‌ అవుతుంది అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!