అల్లరోడు సినిమాకు భారీ నష్టం!

అల్లరి నరేష్ ఈ మధ్య ఏది పెద్దగా కలిసిరావడం లేదు. 2016 లో సెల్ఫీరాజా సినిమాను విడుదల చేశాడు. అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో ఇప్పటివరకు తను టచ్ చేయని జోనర్ హారర్ కామెడీ నేపధ్యంలో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే సినిమాలో నటించాడు. 2016 చివర్లో విడుదలయిన ఈ సినిమాతో నరేష్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. 6 కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన ఈ సినిమా కనీసం కోటి రూపాయలను కూడా వసూలు చేసే పరిస్థితిలో లేదు. నరేష్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉంటుంది. పైగా హారర్ కామెడీ గనుక ఖచ్చితంగా సినిమా చూస్తారని చిత్రబృందం ఆశించింది.

కానీ పరిస్థితి వేరేలా ఉంది. మాస్ ఆడియన్స్ కూడా సినిమాను పట్టించుకోవడం లేదు. జనవరి 1 పైగా ఆదివారం మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండాలి.. కానీ నరేష్ సినిమాకు 50 శాతం టికెట్స్ కూడా తెగలేదు. దీంతో పాటు విడుదలయిన నారా రోహిత్ నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా మాత్రం మంచి టాక్ తో దూసుకుపోతుంది. కానీ విడుదలైన రోజునే ఇంట్లో దెయ్యానికి ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా థియేటర్ వైపు కూడా ఎవరూ వెళ్ళడం లేదు!